VSP: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సుమారు 500 మంది ఫిర్యాదుదారులు హాజరై తమ సమస్యలను వినిపించారు. భూ సమస్యలే అధికంగా వచ్చినట్లు ఆయన తెలిపారు. హౌస్ సైట్లు, పట్టాలు, అసైన్డ్ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.