ATP: శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గడంతో జిల్లాలోని హంద్రీనీవా ప్రధాన కాలువలో ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం ఆరు పంపుల నుంచి మాత్రమే నీటిని ఎత్తిపోస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు 50 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి రికార్డు సృష్టించారు. కాలువలో ప్రస్తుతం 2,200 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది.