VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి వారి స్వర్ణ పుష్పార్చన ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో కన్నుల పండుగగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ కల్యాణ మండపంలో వేద మంత్రాల నడుమ స్వామివారి స్వర్ణపుష్పార్చన జరిగింది.