TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఇంటి దగ్గర ఉద్రక్తత వాతావరణం చోటుచేసుకుంది. రామచందర్ రావు కామారెడ్డి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. రామచందర్ రావుతో పాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.