AP: సీఎం చంద్రబాబుపై మాజీమంత్రి వెల్లంపల్లి ఫైర్ అయ్యారు. పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని చందాలతో పెడతారా? NTR విగ్రహాన్ని ప్రభుత్వ సొమ్ముతో నిర్మిస్తారా? అని ప్రశ్నించారు. ఆ విగ్రహాన్ని ఆర్యవైశ్యులు చందాలు వేసుకుని నిర్మించారని అన్నారు. అమరజీవికి చంద్రబాబు ఎప్పుడూ సరైన గౌరవం ఇవ్వలేదన్నారు. పొట్టి శ్రీరాములుకు ఎలాంటి గౌరవం ఇవ్వని వ్యక్తి చంద్రబాబే అని విమర్శించారు.