HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా నియమితులైన బీజేపీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానెలిస్టులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొని వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లే వ్యూహాలపై చర్చించారు.