NLR: ఉగాది పర్వదినం నాడు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు నక్షత్ర హారతి, రాత్రి పంచాంగ శ్రవణం, పల్లకి సేవ ఉంటుందని, అర్చకులు నరసింహ చారి తెలిపారు. నూతన ముత్తంగి కవచం స్వామి అమ్మవార్లకు అలంకరించడం జరుగుతుందని చెప్పారు. భక్తులు తరలివచ్చి శ్రీవార్ల ఆశీస్సులు పొందాలని కోరారు.