TG: అసెంబ్లీలో రైతుల సమస్యలు, 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వెల్లడించారు. గుజరాత్లో సబర్మతి నది అభివృద్ధికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తే.. తెలంగాణలో మూసీ పునరుద్ధరణ పేరుతో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.