ASR: పది పరీక్షలు పటిష్ట బందోబస్తు నడుమ నిర్వహిస్తున్నారు. అరకులోయ మండలంలోని ఐదు కేంద్రాలలో జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు పది పరీక్షల కేంద్రాల వద్ద భారీ బందోబస్తు సోమవారం ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. హాల్ టికెట్ చూసిన తర్వాత పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తున్నారు.