AP: శ్రీశైలం మహాక్షేత్రంలో ఇవాళ్టి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు శ్రీస్వామి, అమ్మవార్లకు వాహనసేవలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల అలంకార దర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. వేల సంఖ్యలో వస్తున్న కన్నడ భక్తులకు దర్శనం, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.