TPT: నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు నందీశ్వరునికి ప్రదోష పూజలు నిర్వహించనున్నారు. ప్రదోష అభిషేక పూజకు అవసరమైన పూజా సామగ్రిని భక్తులు కానుకలుగా సమర్పించవచ్చు. పూజలో పాల్గొనాలనుకునే భక్తులు రూ.500 టికెట్ తీసుకోవాలని ఆలయ ఈవో తెలిపారు.