AKP: పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామంలో కొత్త అమావాస్య సందర్భంగా ఈనెల 18వ తేదీన నూకాలమ్మ తల్లి జాతరను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆలయం వద్ద జాతర గోడపత్రికను జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు వెన్నెల నరసింహారావు ఆవిష్కరించారు. జాతర సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తామన్నారు.