KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రజిత ఇవాళ తెలిపారు. ఎంపీసీలో 60 సీట్లు, బైపీసీలో 40 సీట్లు, ఎంపీసీలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కళాశాల వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.