TPT: నాయుడుపేట గ్రామదేవత శ్రీ పోలేరమ్మ జాతర మే 5, 6 తేదీల్లో వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఆదివారం విన్నమాల పెద్దకాపు అరవభూమి శ్రీనివాసులు రెడ్డిని ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు కలిసి సాంప్రదాయబద్ధంగా తాంబూలం ఇచ్చి జాతరకు ఆహ్వానించారు. మార్చి 17న మొదటి చాటింపుతో ఉత్సవాలు మొదలవుతాయని, మే 3న ఘట్ట ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈవో నవీన్ కుమార్ తెలిపారు.