ASF: రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీ సర్పంచ్ బాబూరావు ఆధ్వర్యంలో పలువురు వార్డు సభ్యులు ఆదివారం BRSలో చేరారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్వయంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.