NLR: జిల్లా వ్యాప్తంగా జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం రాత్రి తెలిపారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లాలో మొత్తం 176 పరీక్షా కేంద్రాల్లో ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నట్లు ఆమె తెలిపారు. పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆమె పేర్కొన్నారు.