»Video Viral Due To Heavy Rains The Train Stopped On The Bridge A Baby Fell From His Hand Into The Canal
Video Viral: భారీ వర్షాలకు వంతెనపై రైలు నిలిపివేత..చేతిలోంచి కాలువలో పడిన శిశువు
భారీ వర్షాలకు ఓ రైలు వంతెనపై ఆగింది. చాలా సేపు అలా వంతెనపై ఆగడంతో ప్రయాణికులు కిందకు దిగడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఓ తాత చేతిలోంచి ఆరునెలల పసిబిడ్డ జారి పడిపోయాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. వరదలతో అనేక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. తాజాగా మహారాష్ట్రాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఓ వంతెనపై రైలు ఆగిపోయింది. దాదాపు రెండు గంటల పాటు ఆ రైలు అ వంతెనపైనే ఉంది. ఈ నేపథ్యంలో రైలు దిగి వంతెనపై నడుస్తున్న ఓ తాత చేతిలోంచి ఆరు నెలల బాబు కాలువలో పడ్డాడు(Infant slips into drain).
విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఆ శిశువు కోసం గాలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అంబర్ నాథ్ లోకల్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే ఈ విషయంపై స్పందించారు. ప్రజలు వర్షాల సమయంలో ఇళ్ల వద్దే ఉండాలని సూచించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రెస్క్యూ సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.