NRPT: ఊట్కూర్ మండలంలోని త్రిప్రాస్పల్లి గ్రామానికి చెందిన మక్తల్ రాజు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. చెకోపోస్ట్ సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు చూపించాలని కోరగా డ్రైవర్ చూపించలేకపోవడంతో టిప్పర్ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ను తరలించారు. అనంతరం మక్తల్ రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.