తమిళంలో మాస్ యాక్షన్ సినిమాలతో భారీ హిట్లను అందుకున్న అట్లీ కుమార్, షారుక్ ఖాన్ (Shahrukh Khan) హీరోగా ‘జవాన్’ సినిమాను రూపొందించాడు. షారుక్ ఖాన్ సొంత బ్యానర్లో నిర్మితమైన పాన్ ఇండియా సినిమా ఇది. ఆయన ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో, నయనతార ఒక కీలకమైన పాత్రను పోషించింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘జవాన్’ సినిమా (Jawaan’ movie) నుంచి నయనతార లుక్‌ను మూవీ టీం తాజాగా రిలీజ్ చేసింది.
నయనతార (Nayanthara) చేతిలో గన్ పట్టుకుని, కూల్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ (Gauri Khan) నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నయన్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొందనే విషయం అర్థమైపోతూనే ఉంది. 20 ఏళ్ల కెరియర్లో నయన్ నేరుగా చేసిన బాలీవుడ్ (Bollywood) సినిమా ఇది.