CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ గారితో కలిసి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద రైతులకు మూడవ విడత ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడిపాల మండలాల పరిధిలో మొత్తం 11,321 రైతులకు మూడో విడత నిధులు రూ.6.32 కోట్లు విడుదల చేశారు. స్థానిక నాయకులతో కలిసి రైతులకు మెగా చెక్కులు పంపిణీ చేశారు.