HYD: చంచల్ గూడ కేంద్ర కారగారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు శ్రీకాంత్‌ను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్, ఉప్పల వెంకటేష్ గుప్తా పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు సరికాదని, రాజకీయ కక్ష సాధింపుల కోసం కేసులు నమోదు చేయడం దురదృష్టకరమన్నారు. శ్రీకాంత్ పై నమోదైన కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.