KMM: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లోని మహా అంబేద్కర్ విగ్రహం వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. డాక్టర్ బిఆర్. అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మన అందరి అదృష్టమని పేర్కొన్నారు. ఆయన ఒక అద్భుతమైన ప్రతిభాశాలి, విజ్ఞాన గని అని కొనియాడారు.