JN: లింగాల గణపురం మండలం కొత్తపల్లి గ్రామంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాదెపాక విష్ణు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను, రాజ్యాంగాన్ని రాయడానికి పడిన కష్టాలను ప్రజలకు వివరించారు. రాజ్యాంగం లేకపోతే మనల్ని మనుషుల్లా కూడా చూడకుండా ఉండేవారన్నారు.