KMR: బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో డాక్టర్ బిఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సీమా గంగారం మాట్లాడుతూ.. దళిత, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అని, ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలు నేడు అందరికీ అందుతున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, హన్మండ్లు, సాయిని అశోక్ పాల్గొన్నారు.