TG: ప్రస్తుత ప్రభుత్వం ప్రజలదని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలే పరమావధిగా తమ పాలన సాగుతోందని చెప్పారు. క్షేత్రస్థాయిలో సామాజిక మార్పు కోసం తాము నిరంతరం శ్రమిస్తున్నామని, ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని.. ప్రజాస్వామ్య బద్ధంగా మన హక్కులను కాపాడుకుందామని సీఎం ప్రజలను కోరారు.