MBNR: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. యువత రక్తదానానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.