AP: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ ఆయనకు నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీనవర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని, సమాజంలో అంటరానితనం, నిర్మూలన, వివక్షపై అలుపెరుగని పోరాటం చేశారని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయకే దక్కుతుందన్నారు.