AP: ప్రొద్దుటూరుకు చెందిన ఓ బాలుడు తండ్రి కోప్పడ్డాడని సైకిల్‌పై 100 కి.మీ ప్రయాణించి నంద్యాల చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలులో రాయచూర్ పారిపోయాడు. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ, నంద్యాలలో దొరికిన సైకిల్ ఆధారంగా గాలించి బాలుడిని సురక్షితంగా ఇంటికి చేర్చారు. చిన్న విషయాలకే ఇలాంటి చేయవద్దని, పెద్దలు మందలించడం సహజమని పోలీసులు బాలిడికి సూచించారు.