విశాఖపట్నంలో గురువారం క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురు చర్చించారు. విశాఖ ఐటీ, డేటా సెంటర్ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇక్కడ 20వేల ఉద్యోగాలు కల్పించే ఐటీ డెవలప్మెంట్ సెంటర్, జీసీసీ, క్లౌడ్, బీపీఎం కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు.