KRNL: దివంగత సీఎం YSR ఆశయ సాధన కోసం పుట్టిన పార్టీ వైసీపీ అని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, బూత్ విభాగం తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దకడబూరులో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో YSR ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.