W.G: అత్తిలి ఎస్.వి.ఎస్.ఎస్ డిగ్రీ కళాశాల పాలకవర్గ సభ్యులు బసవ అర్జునరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. పాలకవర్గం అధ్యక్షులు దాసం గోవిందరావు, కార్యదర్శి మద్దాల వెంకటేశ్వరరావు తమ సంతాపాన్ని తెలిపారు. అర్జునరావు కళాశాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని నివాళులు అర్పించారు. అత్తిలి ఏఎంసీ ఛైర్మన్ దాసం ప్రసాద్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.