విశాఖ టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేష్ గురువారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని విధాల అండగా ఉంటామని ప్రజలకు మంత్రి భరోసా ఇచ్చారు. అయితే విశాఖలో క్యాప్ జెమిని ప్రతినిధులతో మంత్రి నేడు భేటీ కానున్నారు.