SRPT: పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోదాడ మున్సిపల్ ఛైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నూతనంగా మున్సిపల్ ఛైర్పర్సన్గా ఎన్నికైన ఎర్నేని కుసుమ బాబును సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో వైద్యశాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.