SRPT: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. బుధవారం నూతనకల్ మండలం మాచనపల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తోందన్నారు.