TG: దేశంలో ఆందోళనకర పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి KTR అన్నారు. గ్యాస్ లేక హోటల్స్ మూసివేయాల్సి వస్తుందన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగే బుద్ధితక్కువ యుద్ధం.. మన మీద కూడా ప్రభావం చూపుతుందన్నారు. యుద్ధంలో పాల్గొంటున్న వివిధ దేశాధినేతలు పురుషులే అని.. ప్రపంచచరిత్రలో ఏ మహిళా నాయకురాలు కూడా తమ దేశాన్ని యుద్ధంలోకి నెట్టలేదన్నారు. అందుకే మనకు కూడా మహిళా నాయకులు అవసరమన్నారు.