SDPT: కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామ శివారులో రూ.200 కోట్లతో 23 ఎకరాల్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులను జిల్లా కలెక్టర్ హైమావతి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.