తుళ్లూరు మండలం నేలపాడులో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ICDS సెక్టార్ సూపర్వైజర్ సీతారావమ్మ పాల్గొన్నారు. బాలికల విద్యతోనే ఆరోగ్యకర సమాజం నిర్మాణం సాధ్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త కరుణకుమారి, తల్లులు, గ్రామస్థులు పాల్గొన్నారు.