కృష్ణా: కేంద్ర మాజీమంత్రి వర్యులు కావూరి సాంబశివరావు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని మచిలీపట్నం MP వల్లభనేని బాలశౌరి బుధవారం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోయిందని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.