TG: కాంగ్రెస్ పాలనలో ఇది చీకటి అధ్యాయమని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అన్యాయానికి క్లీన్ చిట్ ఇచ్చే తీర్పు అన్నారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇది క్లీన్ చిట్ కాదు.. ప్రజాస్వామ్యం మీద కొట్టిన దెబ్బ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే.