నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా పానగల్, అద్దంకి బైపాస్ ఫ్లైఓవర్లపై జాతీయ జెండా రంగుల్లో ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ లైట్లను మేయర్ బుర్రి చైతన్య రెడ్డి ప్రారంభించారు. మంత్రి కోమటిరెడ్డి సహకారంతో పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆమె పేర్కొన్నారు. ఈ లైట్ల వెలుగులతో ఫ్లైఓవర్లు సరికొత్త రూపును సంతరించుకున్నాయి.