ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం సెట్స్ పై ఉంది. అయితే ఈ సినిమా కంప్లీట్ అవ్వకముందే.. సుజీత్ సినిమాకు పచ్చజెండా ఊపేశారు పవన్. అది కూడా హరీష్ శంకర్ లైన్లో ఉండగానే అనౌన్స్ చేశారు. దాంతో సుజీత్ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు. అయితే పొలిటికల్ కారణంగా పవన్ కొత్త సినిమాలు చేయరని భావించిన అభిమానులు.. సుజీత్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు పవన్ వర్సెస్ చరణ్‌గా ఈ కొత్త ప్రాజెక్ట్ చర్చకు దారి తీసింది. పవన్-సుజీత్ అనౌన్స్ చేసిన పోస్టర్ ప్రకారం.. ఇది పక్కా గ్యాంగ్ స్టర్ సినిమా అని అంటున్నారు. అందుకే పోస్టర్ పైన ఓజి అని ప్రకటించారు.. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. మామూలుగా అయితే ఓజి అని.. రామ్ చరణ్‌ను పిలుస్తుంటారు. కానీ ఇప్పుడు పవన్‌ను ఓజి అనడంతో.. మెగా ఫ్యాన్స్ మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై సోషల్ మీడియాలో కొందరు డిబేట్లు పెడుతూ.. రామ్ చరణ్ అసలైన OG అని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ ట్యాగ్‌ని పవన్ కళ్యాణ్‌కు పెట్టడం ఏంటని.. కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుత ఈ వ్యవహారం చరణ్ వర్సెస్ పవన్‌గా మారిపోయింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. అసలు పవన్, చరణ్ గురించి మెగాభిమానుల్లో ఎలాంటి విభేదాలు లేవు. కానీ మెగాభిమానులుగా చెప్పుకునే కొందరు యాంటీ ఫ్యాన్స్.. దీన్ని హైలెట్ చేస్తున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు. దీని వెనక ఏదైనా పొలిటికల్ కుట్రలు ఉన్నాయా.. అనే సందేహాలు కూడా వెలువడుతున్నాయి. ఇదే కాదు.. గతంలో కూడా అల్లు వర్సెస్ మెగా వార్ ఇంతకు మించి జరిగింది. దాంతో ఈసారి మెగా కాంపౌండ్ కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్. మొత్తంగా.. చరణ్‌కు ఎంతో ఇష్టమైన బాబాయ్ పవన్ కళ్యాణ్ మధ్య అనవసర చర్చ చేస్తున్నారనే చెప్పాలి.