ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆమె చేపట్టిన ప్రస్థానం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.
ఆమె చేస్తున్న పాదయాత్రలో… టీఆర్ఎస్ కార్యకర్తలు గో బ్యాక్ షర్మిల అంటూ ఆందోళన చేప్టట్టారు. దీంతో వైఎస్సార్టీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో వరంగల్ చెన్నారావు పేట మండలంలోని లింగగిరి వద్ద పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. అనంతరం షర్మిలను పోలీసులు హైదరాబాద్ కి తరలించారు.
షర్మిల అరెస్ట్ ని నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు తెలుస్తోంది.