భారత మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 323 పరుగులకు ఆలౌటైంది. సదర్లాండ్ (129) సెంచరీతో మెరవగా, పెర్రీ (76) హాఫ్ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో సయాలి 4 వికెట్లు పడగొట్టగా, క్రాంతి, దీప్తి తలో రెండు వికెట్లు తీశారు. అయితే, భారత్ తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులే చేయడంతో, ఆస్ట్రేలియాకు 125 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.