KMM: ఖమ్మం నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో ఫ్రెండ్స్ క్లబ్ -2026 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు తమ ప్రయత్నాలను విజయానికి తొలిమెట్టుగా మలుచుకోవాలని సూచించారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా స్నేహసంబంధాలు మెరుగవుతాయని అన్నారు.