అమెరికాకు చెందిన ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ DUI కేసులో అరెస్ట్ అయ్యింది. కాలిఫోర్నియాలో ఆమె మద్యం తాగి కార్ నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెపై DUI కేసు నమోదు చేసి విడుదల చేశారు. విచారణ నిమిత్తం మే 4న కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. కాగా మద్యం, డ్రగ్స్ వంటివి తీసుకుని డ్రైవ్ చేసేవారిపై DUI కేసు ఫైల్ చేస్తారు.