శ్రీకాకుళం నగరపాలక సంస్థలో డయేరియా పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చింది. ఇవాళ ఉదయం 5.30 గంటల నుంచే పారిశుద్ధ్య పనులు ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ పర్మాన్ అహమ్మద్ ఖాన్ పనులను పర్య వేక్షిస్తున్నారు. 50 డివిజన్ల పరిధిలో జేసీబీలు, ట్రాక్టర్లు, ట్రిప్పర్లు అందుబాటులో ఉంచి చెత్తను డంపింగ్ యార్డ్‌కి తరలిస్తున్నారు.