ఏపీ సీఎం జగన్ ని చూసి… తెలంగాణ సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని బీజేపీ నేత లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. రేపు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో… ప్రధాని సభ ఏర్పాట్లను లక్ష్మణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కెసిఆర్ రేపటి కార్యక్రమానికి హాజరు కావాలని రాష్ట్ర బిజెపి తరఫున కోరుతున్నామని… సమాఖ్య స్పూర్తి ని మోడీ గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి యేతర పాలన లో ఉన్న రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.
25 వేల కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ పర్యటన కొనసాగుతుంది.. తమిళ్ నాడు, ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీని పార్టీలకతీతంగా ఆహ్వానిస్తుంటే.. తెలంగాణలో మాత్రం స్వాగతించడం లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి. ఇది సబబు కాదని మండిపడ్డారు.