ADB: జిల్లా సీతాగొంది వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న క్రూయిజర్ వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.