JGL: వీర్నపల్లి మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ టోర్నమెంట్లో ఐదు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. తుది పోరులో వీర్నపల్లి ఎంపీటీసీ క్లస్టర్ జట్టు, రంగంపేట ఎంపీటీసీ క్లస్టర్ జట్టు తలపడ్డాయి. ఇరు జట్లు గెలుపు కోసం చివరి వరకు పోరాడగా వీర్నపల్లి ఎంపీటీసీ క్లస్టర్ జట్టు విజేతగా నిలిచింది.