MBNR: రాజాపూర్ మండల కేంద్రంలో సాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతుండటంపై సర్పంచ్ కావలి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించి, రోడ్డు సిబ్బందితో మాట్లాడారు. ప్రమాదాల నివారణలో గుత్తేదారు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వాహనదారుల భద్రత దృష్ట్యా వెంటనే తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.